: న్యాయాధికారులకు న్యాయం చేయాలి: ఎంపీ వినోద్
ఆప్షన్ల రద్దు కోసం ఉద్యమించిన న్యాయాధికారుల్లో ఇద్దరిని తొలగించడం పట్ల ఎంపీ వినోద్ విచారం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యాయాధికారులు న్యాయమైన తమ డిమాండ్ల కోసమే ఉద్యమిస్తున్నారని అన్నారు. వారికి తన మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. న్యాయవాదుల డిమాండ్లపై టీఆర్ఎస్ ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన చెప్పారు. ఆప్షన్లు రద్దు అంశాన్ని తాము కేంద్రం ముందు ఉంచుతామని అన్నారు. న్యాయాధికారులపై హైకోర్టు సీరియస్ అవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు.