: చైనా పర్యటనకు అన్ని సూట్ కేసులెందుకు?: చంద్రబాబుకు అంబటి ప్రశ్న
చైనాకు బయలుదేరిన చంద్రబాబు విమానంలో ఎన్నో సూట్ కేసులు ఉన్నాయని, ఐదు రోజుల పర్యటనకు అన్ని సూట్ కేసుల నిండా ఏం తీసుకువెళ్లారని వైకాపా నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో దోచుకున్న డబ్బులను విదేశాల్లో దాచుకునేందుకే ఆయన పర్యటనలకు వెళుతున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. గతంలోనూ చంద్రబాబు పలు దేశాల్లో పర్యటించి ఒప్పందాలు చేసుకు వచ్చారని, అయినా రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదని విమర్శించారు. విదేశీ పర్యటనల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు పోటీ పడుతున్నారని నిప్పులు చెరిగారు. ఇక్కడ 'నెంబర్ వన్ కూలీని' అని చెప్పుకునే చంద్రబాబు చైనాలో ఏడు నక్షత్రాల హోటల్ లో తప్ప మరెక్కడా బస చేయడం లేదని, తన ఇంటికోసం కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అంబటి విమర్శించారు.