: కేసీఆర్ ది కూడా ‘టీడీపీ’ పాఠశాలేనట!... ‘గాలి ముద్దుకృష్ణమ’ ఆసక్తికర వ్యాఖ్య!
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన కేసీఆర్ ను టీడీపీలో శిక్షణ పొందిన నేతగానే అభివర్ణించారు. ‘‘కేసీఆర్ తెలుగుదేశం పాఠశాలలో చదువుకున్నారు. ఇక్కడే శిక్షణ పొందారు. ఆ వారసత్వం కాబట్టే టీడీపీ అమలు చేసిన కార్యక్రమాలనే అమలు చేస్తున్నారు. ముస్లిం విద్యార్థుల కోసం వంద పాఠశాలలు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆ పాఠశాలలకు ఆద్యుడు ఎన్టీఆరే. చంద్రబాబు కూడా గతంలో షాదీఖానాలు, దర్గాలు, మసీదుల నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధులిచ్చారు’’ అని ముద్దుకృష్ణమనాయుడు వ్యాఖ్యానించారు.