: ప్రకాశం బ్యారేజ్ పై మరమ్మతులు... రాకపోకల నిలిపివేత!
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ పై మరమ్మతులు నిర్వహించనున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. ఈరోజు అర్ధరాత్రి నుంచి బ్యారేజీపై వాహనాలను అనుమతించబోమని నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు పాదచారులను కూడా బ్యారేజీపైకి అనుమతించమని చెప్పారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ను మళ్లించనున్నామని, బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, కృష్ణ లంక, కుమ్మరిపాలెం, వన్ టౌన్ నుంచి తాడేపల్లి, సీతానగరం వెళ్లే వాహనాలను కనకదుర్గమ్మ వారధి వైపు మళ్లించనున్నట్లు గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు.