: హైకోర్టు ఎదురుగా రోడ్డుపై న్యాయవాదుల బైఠాయింపు.. భారీగా ట్రాఫిక్ జాం
హైకోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లో నిన్న న్యాయాధికారులు చేసిన ఆందోళన పట్ల ఆగ్రహించిన హైకోర్టు ఇద్దరు న్యాయాధికారులను ఈరోజు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై న్యాయవాదులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. హైకోర్టు ముందు రోడ్డుపై బైఠాయించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ వరప్రసాద్‌లపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాల్సిందేనని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు.