: కమలాపూర్ బాలుర పాఠశాలకు బస్సును బహూకరించిన ఈటల
తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని కమలాపూర్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వద్ద ఆయన విద్యార్థులతో కలసి మొక్కలు నాటారు. మొక్కలతో పర్యావరణ సమతుల్యత కాపాడుకోవచ్చని ఆయన అన్నారు. అనంతరం పాఠశాల వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు పాఠశాలకు చేరుకునేందుకుగాను పాఠశాలకు బస్సును బహూకరించారు. ఈటల ఇచ్చిన బహుమానం పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.