: ప్రజా సమస్యలపై ఎలా పోరాడుదాం..? గాంధీ భవన్‌లో సమావేశమైన కాంగ్రెస్ నేతలు
తెలంగాణలో పెంచిన విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు, ప్రజా సమస్యలపై పోరాటాన్ని కొనసాగించడం కోసం ఏఐసీసీ ప్రతినిధి శ్రీనివాసన్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో భేటీ అయిన నేతలు పార్టీ అనుసరించాల్సిన భవిష్యత్ వ్యూహాలపై చర్చలు కొనసాగిస్తున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగాల్సిన అంశాలపై నేతలు తమ అభిప్రాయాలు తెలుపుతున్నట్లు తెలుస్తోంది. సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.