: న్యాయవాది సజీవ దహనం కేసును ఛేదించిన పోలీసులు
కీసర వద్ద న్యాయవాది సజీవ దహనం కేసును పోలీసులు ఛేదించారు. కేవలం 24 గంటల్లోనే వాస్తవాలను బయటకు లాగారు. నిన్న న్యాయవాది ఉదయ్ కుమార్‌ను కారుతో సహా దుండగులు సజీవదహనం చేసిన సంగతి తెలిసిందే. ఐదు ఎకరాల భూమిపై వివాదం చెలరేగి దుండగులు న్యాయవాదిని హతమార్చినట్లు తెలుస్తోంది. హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీడిన న్యాయవాది మర్డర్ మిస్టరీ గురించి పోలీసులు ఈరోజు సాయంత్రం మీడియాకు వివరించనున్నట్లు సమాచారం.