: ఉద్యోగుల‌కు ఎటువంటి ఇబ్బందులు క‌ల‌గ‌వు.. వారం రోజుల పాటు ఉచిత భోజనం కూడా!: మ‌ంత్రి అయ్య‌న్న‌


ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో నూతన కార్యాల‌యాల ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మాలు రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా జ‌రుగుతున్నాయి. ఈరోజు 15 కార్యాల‌యాలు ప్రారంభ‌మ‌య్యాయి. విజయవాడ నక్కలరోడ్డులో పంచాయ‌తీ రాజ్ కార్యాల‌యాన్ని మంత్రి అయ్య‌న్న పాత్రుడు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. వారం రోజుల్లో విజయవాడ నుంచే పూర్తిస్థాయిలో ప్ర‌భుత్వ కార్యకలాపాలు జ‌రుపుతామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. త‌మ ప్ర‌భుత్వం ఉద్యోగులకు అందించే వ‌స‌తుల ప‌ట్ల స్ప‌ష్ట‌త‌తో ఉంద‌ని, వారికి అక్క‌డ ఎటువంటి ఇబ్బందులు క‌ల‌గ‌బోవ‌ని ఆయ‌న అన్నారు. ఉద్యోగుల‌కు వారం రోజుల పాటు ఉచిత భోజ‌న స‌దుపాయాన్ని కూడా క‌ల్పిస్తున్నట్లు ఆయ‌న పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News