: తెలంగాణపై మాట మార్చిన కాంగ్రెస్: మాయావతి


తెలంగాణ  ఇస్తామని మాట ఇచ్చి ఎన్నికల ప్రచారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ, ఇపుడు ఆ అంశాన్ని పక్కదోవ పట్టిస్తోందని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధికి చేసిన కృషి చాలా తక్కువని ఆమె ఆరోపించారు.

బెంగళూరు ప్యాలెస్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న మాయావతి కాంగ్రెస్ పాలనపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ విధానాల వల్లే దేశంలో నక్సలిజం సమస్య పెరిగిందని ఆమె ఆరోపించారు. గిరిజనులను అడవుల నుంచి బయటకు పంపి ఆ ప్రాంతాలను వ్యాపారులకు కట్టబెడుతున్నారని మాయావతి విమర్శించారు.

  • Loading...

More Telugu News