: గవర్నర్ ను కలిసి తెలంగాణ జడ్జీలు... పరిశీలిస్తానన్న నరసింహన్


ఆప్షన్ విధానాన్ని నిరసిస్తూ మూకుమ్మడి రాజీనామాలు చేసిన తెలంగాణ జడ్జీలు కొద్ది సేపటి క్రితం గవర్నర్ నరసింహన్ ను కలిశారు. 155 మంది జడ్జీల రాజీనామా లేఖలను ఆయనకు సమర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ వారితో మాట్లాడుతూ, పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాగా, గన్ పార్క్ నుంచి రాజ్ భవన్ వద్దకు వారు ర్యాలీగా వెళ్లారు. రాజ్ భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News