: మీడియాపై దురుసుగా ప్రవర్తించిన బాలీవుడ్ నటుడు
బాలీవుడ్ నటుడు పుల్ కిత్ సమ్రాట్ ముంబయిలో మీడియాతో దురుసుగా ప్రవర్తించాడు. పుల్ కిత్, యామీ గౌతమ్ నటించిన తాజా చిత్రం ‘జునూనియత్’ ప్రచార కార్యక్రమాన్ని ముగించుకుని యూనిట్ ముంబయి చేరుకున్నారు. అక్కడి ఎయిర్ పోర్టు నుంచి పుల్ కిత్ బయటకు వస్తున్న సమయంలో మీడియా ఫొటోగ్రాఫర్లు ఎగబడడ్డారు. దీంతో ఆగ్రహించిన పుల్ కిత్ తన చేతిలోని బ్యాగ్ ను ఒక ఫొటోగ్రాఫర్ పై విసరబోయాడు. కాగా, ఈ సంఘటనపై మీడియా మండిపడుతోంది.