: కర్ణాటక సీఎంకు ముద్దుపెట్టిన పంచాయతీ సభ్యురాలు!
అందరూ చూస్తుండగా సన్మాన వేదికపైనే కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు పంచాయతీ సభ్యురాలు ముద్దుపెట్టింది. చిక్ మగ్ ళూరు జిల్లా తరికేరే ప్రాంతానికి చెందిన పంచాయతీ సభ్యురాలు గిరిజా శ్రీనివాస్ ను సీఎం సిద్ధరామయ్య సన్మానించారు. అనంతరం, అందరూ చూస్తుండగానే సభావేదికపైనే సీఎం బుగ్గపై గిరిజ ముద్దు పెట్టింది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ, ఆయన తన తండ్రి లాంటివాడని, అందుకే ముద్దు పెట్టానని చెప్పారు. అంతేకాకుండా, ఆయన్ని తాను కలవడం ఇదే మొదటిసారని, సంతోషం పట్టలేకనే ముద్దుపెట్టుకున్నానని, ఇందులో తప్పేముందని గిరిజా శ్రీనివాస్ పేర్కొన్నారు.