: కీసరలో హైదరాబాదుకు చెందిన న్యాయవాది మర్డర్


రంగారెడ్డి జిల్లా కీసరలో న్యాయవాది దారుణహత్యకు గురయ్యారు. న్యాయవాది ఉదయ్ కుమార్ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మృతదేహాన్ని కారులో ఉంచి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు తెలుస్తోంది. కాగా, మృతుడు హైదరాబాద్ లోని కుషాయిగూడకు చెందిన న్యాయవాది ఉదయ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. న్యాయవాదికి చెందిన సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News