: ఢిల్లీ డిప్యూటీ సీఎం, 65 మంది ఆప్ ఎమ్మెల్యేల అరెస్ట్
రేస్ కోర్సు రోడ్డులోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి ర్యాలీగా బయలుదేరిన ఆప్ నేతలందరినీ పోలీసులు తుగ్లక్ రోడ్డు సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. తమ ఎమ్మెల్యే దినేష్ ను అరెస్ట్ చేయడంతో పాటు ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై కేసు పెట్టడాన్ని నిరసించిన ఆప్ ఎమ్మెల్యేలు, ఈ ఉదయం మోదీ ఇంటికి ర్యాలీగా బయలుదేరారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ, నరేంద్ర మోదీ ముందు సిసోడియా పోలీసులకు లొంగిపోతారని ప్రకటించారు. ఆపై వీరి ర్యాలీ తుగ్లక్ రోడ్డుకు చేరుకోగా, పోలీసులు అడ్డుకున్న తరుణంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. కాగా, సిసోడియా తమను దూషించారని ఘజియాబాద్ మండీ వ్యాపారులు ఫిర్యాదు చేయగా కేసు నమోదైన సంగతి తెలిసిందే.