: "మోదీ అత్యుత్తమ ప్రధాని"... వేల మందిని ఫూల్స్ చేసిన యునెస్కో రూమర్!


"ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రధానిగా యునెస్కో నరేంద్ర మోదీని ప్రకటించింది" అన్న తప్పుడు వార్త ఎంతో మంది ప్రముఖులు సహా వేల మందిని ఫూల్స్ చేసింది. ఎవరు తొలుత పోస్టు చేశారో తెలియదు గానీ, మోదీని యునెస్కో అత్యుత్తమ ప్రధానిగా ప్రకటించినట్టు బిలియర్డ్స్ స్టార్ ఆటగాడు పంకజ్ అద్వానీ తన ట్విట్టర్ ఖాతాలో పెట్టడంతో ఆయనకున్న రెండు లక్షల మందికి పైగా ఫాలోయర్లు తమ అభినందనలు తెలపడంతో ఈ పోస్టు వైరల్ అయింది. వాట్స్ యాప్, ఫేస్ బుక్ సహా అన్ని సామాజిక మాధ్యమాల్లో మోదీని అభినందిస్తూ, పోస్టులు వెల్లువెత్తాయి. ఆపై అటువంటి ప్రకటనేదీ యునెస్కో నుంచి రాలేదని స్పష్టమైంది. తప్పుడు వాట్స్ యాప్ సమాచారాన్ని ఫార్వార్డ్ చేయడంలో ఇండియా ఉత్తమ దేశమంటూ వెక్కిరింత ట్వీట్లు ఇప్పుడు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News