: అమరావతి వెళ్లి బిర్యానీ తిని రాలేదా?: కేసీఆర్ పై రేవంత్ నిప్పులు


గతంలో తెలంగాణకు అడ్డుపడిన వారితో కేసీఆర్ దగ్గరి సంబంధాలను కలిగివున్నారని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ నీటి ప్రాజెక్టులకు ఆంధ్రావాళ్లు అడ్డుపడుతున్నారని విమర్శిస్తున్న కేసీఆర్, అమరావతికి వెళ్లి బిర్యానీ ఎందుకు తిని వచ్చాడని ఆయన ప్రశ్నించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో నిరాశ్రయులు అయ్యే ప్రజలకు సంఘీభావంగా ఆయన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యాగం తలపెట్టిన సమయంలో చంద్రబాబు నాయుడు, వెంకయ్య, రామోజీరావు, రాధాకృష్ణ, కేవీపీ రామచంద్రరావు వంటి వాళ్లను ఎందరినో స్వయంగా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చారని ఆరోపించిన రేవంత్, వీరంతా తెలంగాణకు అడ్డుపడిన వారేనని కేసీఆర్ అన్నారని, మరి వీరిని ఎలా పిలిచారని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News