: వెళ్లేదేదో త్వరగా వెళ్లండి: బ్రిటన్ కు ఈయూ అల్టిమేట్టం


యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలన్న ప్రజల కోరిక మేరకు బ్రిటన్ వీలైనంత త్వరగా కూటమిని వీడి వెళ్లాలని మిగతా సభ్య దేశాలు వ్యాఖ్యానించాయి. ఈయూ ఫౌండేషన్ దేశాలుగా ఉన్న ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, లగ్జెంబర్గ్, ఇటలీ, నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రులు సమావేశమై తాజా పరిస్థితులను చర్చించారు. డేవిడ్ కామెరూన్ రాజీనామా నేపథ్యంలో కొత్త ప్రధాని మిగతా ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. కామెరూన్ త్వరగా కొత్త ప్రధానికి బాధ్యతలు అప్పగించాలని సూచించారు. యూనియన్ నుంచి తప్పుకునేందుకు క్లిష్టంగా ఉన్న నిబంధనలను సరళతరం చేయడంపైనా వీరు చర్చించారు. బ్రిటన్ వెళ్లిపోయినా యూనియన్ కు వచ్చిన నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారు. బ్రిటన్ వీడిన తరువాత యూనియన్ ను మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News