: ప్రధాని మోదీని కలిసిన చిన్నారి వైశాలి యాదవ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చిన్నారి వైశాలి యాదవ్ పూణెలో ఈరోజు కలిసింది. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్యం గురించి మోదీ అడిగి తెలుసుకున్నారు. చిన్నారి కుటుంబసభ్యులు కూడా ఆమె వెంట ఉన్నారు. కాగా, పూణెకు చెందిన వైశాలి యాదవ్ కు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) సహాయంతో ఇటీవల హార్ట్ సర్జరీ చేశారు. తన అనారోగ్యం గురించి మోదీకి లేఖ ద్వారా వైశాలి తెలియజేయడంతో, సాయం చేస్తామని మోదీ చెప్పడం, ఆ వెంటనే ఆర్థిక సాయం చేయడం తెలిసిందే. హార్ట్ సర్జరీ అనంతరం వైశాలి తన కృతజ్ఞతలు తెలుపుతూ మరో లేఖ మోదీకి రాసింది. దీనికి బదులుగా వైశాలి యాదవ్ కు మోదీ కూడా ఇటీవల లేఖ రాశారు.