: జమ్మూకాశ్మీర్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు... సీఆర్పీఎఫ్ బస్సుపై కాల్పులు
జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లాలోని పాంపోర్ కు సమీపంలో సీఆర్ఫీఎఫ్ బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. దీనిని ప్రతిఘటించిన సీఆర్పీఎఫ్ జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు. ఈ సంఘటనలో ఐదుగురు జవాన్లు మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారని, కాల్పుల్లో మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా గాయపడ్డారని సమాచారం. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.