: సినీ కార్మికులకు అండగా ఉంటాం: తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి
సినీ కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ చిత్రపురి కాలనీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం చిత్రపురికాలనీ సొసైటీ సభ్యులతో ఈ విషయమై ఆయన చర్చించారు.