: రాజధానికి భూములిచ్చిన రైతులకు ఎక్కడ స్థలాలు వచ్చాయో క్షణాల్లో తెలిపే సరికొత్త సాఫ్ట్ వేర్


నవ్యాంధ్ర రాజధానికి భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించారు. వారికి ఎక్కడ స్థలాలు వచ్చాయో క్షణాల్లో తెలిపే సరికొత్త సాఫ్ట్ వేర్ ను ఏపీ ప్రభుత్వం రూపొందించింది. ఈవీఎం తరహాలో ఈ సరికొత్త సాఫ్ట్ వేర్ ఉన్నట్లు సమాచారం. రైతులకు స్థలాల కేటాయింపు మొదటి ఘట్టాన్ని తుళ్లూరు లోని నేలపాడు రైతులతో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అమరావతిలో రాజధాని వస్తుందని ఎవరూ ఊహించలేదని, రాష్ట్ర ప్రజలందరికీ సమాన దూరంలో ఉండేలా ఆలోచించి రాజధానిని ఇక్కడ ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నామని బాబు అన్నారు.

  • Loading...

More Telugu News