: కూతుళ్లపై కాల్పులు జరిపి చంపిన మహిళ.. ఆపై పోలీసుల కాల్పుల్లో మృతి
అమెరికాలోని టెక్సాస్‌లో దారుణం చోటు చేసుకుంది. కూతుళ్లని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లే వారిపై కాల్పులు జరిపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. హ్యూస్టన్ నగర శివారులోని ఫుల్షెర్‌లో ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లను తుపాకితో కాల్చి చంపేసింది. విషయాన్ని తెలుసుకొని అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ మహిళ చేతిలో తుపాకి ఉండడాన్ని గమనించారు. మహిళ మరోసారి తన కూతుళ్లపై కాల్పులు జరుపుతుండడంతో పోలీసులు ఆమెపై కాల్పులు జరిపారు. దీంతో ఆ మహిళ కూడా మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ విషయాన్ని మీడియాకి తెలిపారు. ఆ మహిళ కుటుంబంలో ఘర్షణలు చెలరేగుతుండంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.