: తెలంగాణలో పెంచిన ఛార్జీలు తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం: వైసీపీ
తెలంగాణ ప్రభుత్వం సామాన్యుడిపై భారం మోపుతూ విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచడాన్ని ఖండిస్తున్నామని తెలంగాణ వైసీపీ తెలిపింది. ఈరోజు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఛార్జీల పెంపునకు నిరసనగా వైసీపీ నేతలు ధర్నా చేశారు. ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆదాయంలో మిగులు సాధిస్తున్న తెలంగాణలో విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచడమేంటని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గిస్తున్నట్లు ప్రకటించాలని, లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని టీ వైసీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు.