: జలవివాదం అంశంలో సానుకూల దృక్పథంతోనే ముందుకెళతాం: ఏపీ మంత్రి దేవినేని ఉమ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏర్పడిన జలవివాదాన్ని సానుకూల దృక్పథంతోనే పరిష్కరించుకుంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరావు అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... నాగార్జునసాగర్ ఆధునికీకరణ పనులకు తాము రూ.1805 కోట్లు వినియోగించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టుల ద్వారా రైతులు, ప్రజలు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నామని, పులిచింతల ముంపు ప్రాంతాల ప్రజలకు పునరావాసం కల్పిస్తున్నట్లు తెలిపారు. అమరావతికి తరలివస్తున్న ఉద్యోగుల వసతులపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, వారికి గుంటూరులో కార్యాలయం అందుబాటులో ఉంటుందని దేవినేని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి తరలివస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రత్యేక వసతి కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.