: అనంతపురం జిల్లా జైల్లోని దొంగతో సెల్‌ఫోన్‌లో మాట్లాడిన పత్రికా ప్రతినిధులు
అనంతపురం జిల్లా జైల్లో సెల్‌ఫోన్ కలకలం చెలరేగింది. శిక్ష అనుభవిస్తున్న ఓ వ్యక్తి దర్జాగా సెల్‌ఫోన్‌లో మాట్లాడిన ఘటన వెలుగులోకొచ్చింది. జైలు సిబ్బంది సహకారంతో శ్రీను అనే ఖైదీ సెల్‌ఫోన్ వాడాడు. అతనితో సెల్ పోన్‌లో ఇద్దరు పత్రికా ప్రతినిధులు మాట్లాడినట్లు సమాచారం. విషయాన్ని తెలుసుకున్న అధికారులు జైలు వార్డెన్ హరినాథ్‌ను సస్పెండ్ చేశారు. ఘటనపై జైలు సూపరింటెండెంట్ నాగేశ్వర రెడ్డి విచారణ చేపట్టారు. విచారణ అనంతరం మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.