: రాజధాని ప్రాంత అనుసంధాన రహదారికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు


గుంటూరు జిల్లా వెంకటపాలెంలో సీడ్ యాక్సిస్ హైవేకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు శనివారం శంకుస్థాపన చేశారు. ఏపీ న‌వ్య‌ రాజధాని ప్రాంతాన్ని అనుసంధానం చేసే విధంగా వెంకటపాలెం వద్ద‌ 6 వరసల రహదారి నిర్మాణం జ‌ర‌గ‌నుంది. 18.3 కిలోమీట‌ర్ల మేర ఈ ర‌హ‌దారి నిర్మాణం ఉంటుంది. ఇందుకోసం రూ.215 కోట్లు కేటాయించారు. ఉద్దండరాయుని పాలెం, లింగాయపాలెం, తాళ్లాయ‌పాలేనికి రాజధానితో అనుసంధానం ఏర్పడనుంది.

  • Loading...

More Telugu News