: రూ.5 కే ఉప్మా, పులిహోర, పెరుగన్నం .. కాసేపట్లో అన్న క్యాంటీన్ ప్రారంభం
అమరావతిలో కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ‘ఎన్టీఆర్ అన్న క్యాంటీన్’ ప్రారంభం కానుంది. తాత్కాలిక సచివాలయంలో భోజనశాల ఏర్పాటు చేశారు. కేవలం ఐదు రూపాయలకే ఉప్మా, పెరుగన్నం, పొంగల్, పులిహోర ఏదైనా ఒక్క ప్లేట్ అందించనున్నారు. రెండు ఇడ్లీల ధర 3 రూపాయలు. సాంబారు అన్నాన్ని కేవలం 7 రూపాయలకే అందించనున్నారు. ఇక రెండు చపాతీలు రూ.4 మాత్రమే. ఎన్టీఆర్ క్యాంటీన్‌లో ఉదయం 7 నుంచి 10 గంటల వరకు అల్పాహారం, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు భోజనం, మళ్లీ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు భోజనాన్ని తక్కువ ధరకే అందించనున్నారు.