: మోదీ దేవుడే!... సందేహాలెందుకంటున్న వెంకయ్య!


ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు మరోమారు తన భక్తిని చాటుకున్నారు. రాజ్యసభకు వరుసగా నాలుగో సారి ఎంపికైన తొలి బీజేపీ నేతగా రికార్డులకెక్కిన వెంకయ్య నిన్న తన సొంత జిల్లా నెల్లూరుకు తొలిసారిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు నెల్లూరు నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్య పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మోదీని దేవుడు అంటే కొందరు తప్పుబడుతున్నారు. దేశ ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మోదీని దేవుడంటే సందేహాలెందుకు?’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News