: చంద్రబాబు సర్కారును టార్గెట్ చేసిన సుబ్రహ్మణ్య స్వామి!... తిరుమలపై గుత్తాధిపత్యమెందుకని వ్యాఖ్య!


విపక్ష పార్టీల నేతలు, ఆర్థిక వేత్తలపై వరుస దాడులు కొనసాగిస్తున్న బీజేపీ ఫైర్ బ్రాండ్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి తాజాగా తమ మిత్రపక్షం టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రంపై టీడీపీ ప్రభుత్వం గుత్తాధిపత్యం కొనసాగిస్తోందని ఆయన నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆలయ భూములపై టీడీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో టీడీపీ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోని పక్షంలో తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు. సుబ్రహ్మణ్య స్వామి చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి.

  • Loading...

More Telugu News