: చిత్తూరు జిల్లాలో ‘హీరో’ ప్లాంటు!... 600 ఎకరాలు కేటాయిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం!


తెలుగు రాష్ట్రాల్లో కొత్త పరిశ్రమల ఏర్పాటు జోరందుకుంది. దేశీయ ఆటోమోబైల్ రంగంలో పేరెన్నికగన్న ‘హీరో మోటో కార్ప్’ తన నూతన ప్లాంటును ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు సదరు కంపెనీ నుంచి అందిన ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు సర్కారు... ఆ సంస్థకు చిత్తూరు జిల్లాలోని సత్యవేడు మండలం మాదన్నపాలెంలో 600 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు నిన్న విజయవాడలో జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయం దరిమిలా హీరో మోటో కార్ప్ కు 600 ఎకరాల భూ బదలాయింపునకు సంబంధించిన ఒప్పంద పత్రాలను సిద్ధం చేయాలని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఏపీఐసీసీకి ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News