: గాలి జనార్దన్ రెడ్డి అనుచరుల కోసం సోదాలు!... మచిలీపట్నంలో కార్డన్ అండ్ సెర్చి!


కర్ణాటక మాజీ మంత్రి, అక్రమ గనుల ఘనుడు గాలి జనార్దన్ రెడ్డి పేరు ఏపీలోని కృష్ణా జిల్లాలో కలకలం రేపుతోంది. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయవాది వికాస్ బన్సోడేపై జరిగిన హత్యాయత్నం జనార్దన్ రెడ్డి అనుచరుల పనేనన్న వార్తలు జిల్లావ్యాప్తంగా పెను కలకలం రేపుతున్నాయి. అక్రమ గనుల వ్యవహారంపై వికాస్ బన్సోడే సుప్రీంకోర్టులో జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా వాదనలు వినిపించారన్న కారణంతోనే బన్సోడేపై హత్యాయత్నం జరిగిందని, ఈ దుశ్చర్యకు పాల్పడ్డ ఇద్దరు దుండగులు కూడా జనార్దన్ రెడ్డి అనుచరులేనన్న పోలీసులు ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని నవీన్ మిట్టల్ కాలనీలో నిన్న పోలీసులు కార్డాన్ అండ్ సెర్చి సోదాలు నిర్వహించారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత డీఎస్పీ శ్రవణ్ ఆధ్వర్యంలో ఏకంగా 200 మంది పోలీసులు నవీన్ మిట్టల్ కాలనీని రౌండప్ చేశారు. కాలనీలోని ప్రతి ఇంటిని జల్లెడ పట్టిన పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అనంతరం నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోదాల్లో భాగంగా సరైన పత్రాలు లేని 16 బైకులు, రెండు ఆటోలు, ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News