: ‘కబడ్డీ’ విజేత ఎవరో?... నేటి నుంచే ప్రొ కబడ్డీ లీగ్-4 సీజన్!


ఇటీవలే ఐపీఎల్- 9 పేరిట జరిగిన పొట్టి క్రికెట్ పండుగ క్రికెట్ అభిమానులను అంతగా ఆకట్టుకోలేదు. అయితే ఏటా ప్రేక్షకుల సంఖ్యను లక్షల కొలది పెంచేసుకుంటూ వెళుతున్న ప్రొ కబడ్డీ లీగ్ నేడు లాంఛనంగా ప్రారంభం కానుంది. గ్రామీణ క్రీడ అయిన కబడ్డీకి దేశంలో మరింత ప్రాచుర్యం కల్పించేందుకు బాలీవుడ్ చోటా బచ్చన్ అభిషేక్ బచ్చన్ పలువురు క్రీడారంగ ప్రముఖులతో కలిసి ప్రారంభించిన ప్రొ కబడ్డీ లీగ్ కు ఏటా ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే మూడేళ్ల పాటు దేశీయ క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకున్న ఈ లీగ్ తన నాలుగో సీజన్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తి చేసుకుంది. పుణే వేదికగా తెలుగు టైటాన్స్, ఫుణెరి పల్టన్స్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ తో ప్రొ కబడ్డీ లీగ్-4 సీజన్ ప్రారంభం కానుంది.

  • Loading...

More Telugu News