: రాజధాని రైతులకు ప్లాట్ల పంపిణీ నేడే!... చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ, అన్న క్యాంటీన్లకూ శ్రీకారం!


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని నిర్మాణం కోసం బంగారు సిరులు పండే భూములను ఇచ్చేసిన రైతులకు చంద్రబాబు ప్లాట్లను పంపిణీ చేయనున్నారు. వారం ముందుగానే ఈ కార్యక్రమం జరగాల్సి ఉన్నా, వర్షం కారణంగా నాడు ఆ కార్యక్రమం వాయిదా పడింది. నేలపాడులో ఏర్పాటు చేసే కార్యక్రమంలో చంద్రబాబు ఆ గ్రామానికి చెందిన రైతులకు ప్లాట్లను అందజేయనున్నారు. ఆ తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్డుకు సీఎం శంకుస్థాపన చేస్తారు. ఇక తాత్కాలిక సచివాలయంలో పనిచేసేందుకు తరలివెళ్లిన ఉద్యోగుల కోసం అమరావతి పరిధిలో కొత్తగా ఏర్పాటైన ‘అన్న క్యాంటీన్’ను కూడా చంద్రబాబు ప్రారంభిస్తారు.

  • Loading...

More Telugu News