: అన్నయ్య చిరంజీవి లేకపోతే నా లైఫ్ సెటిలయ్యేది కాదు: హీరో సునీల్
‘అన్నయ్య చిరంజీవి లేకపోతే నా లైఫ్ సెటిలయ్యేది కాదు’ అని హీరో సునీల్ అన్నాడు. జక్కన్న ఆడియో రిలీజ్ అనంతరం ఆయన మాట్లాడుతూ, "వెనకాల అన్నయ్యను, ముందు మిమ్మల్ని చూస్తుంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. లైఫ్ లో ఇంతకంటే ఇంకేమి కావాలనిపిస్తోంది. అన్నయ్య సినిమా చూడడం కోసం లైన్లో మూడు గంటలు కష్టపడి నిలబడి, అందరినీ కొట్టేసి టిక్కెట్టు తీసుకుని సినిమా చూసి, ఆ డ్యాన్స్ లు నేర్చుకున్నాను. ఆయన లేకపోతే నా లైఫ్ సెటిలయ్యేది కాదండి. ఆయన వల్లే ఈరోజున ఇక్కడున్నాను. అన్నయ్య 150వ సినిమా షూటింగ్ మొదలైంది. ఈరోజు షూటింగ్ చేశారు. ఈ కార్యక్రమం నుంచి వెళ్లి మళ్లీ షూటింగ్ చేస్తారు. కానీ, నా కోసం అన్నయ్య ఇక్కడికి వచ్చారు... ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. ఆయనే కాదు, ఆయన మనసు కూడా మెగాస్టారే. అన్నయ్య ఉండగా ఎక్కువ మాట్లాడటం బాగోదు. అన్నయ్య మాట్లాడిన తర్వాత లాస్ట్ లో మళ్లీ మాట్లాడతాను" అని సునీల్ అన్నాడు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడి ఆయన వెళ్లిపోయిన అనంతరం సునీల్ ఈ చిత్రం విశేషాల గురించి ప్రస్తావిస్తూ, ఈ సినిమా అంతా కామెడీమయమని, కథలో కొత్తదనంతో పాటు డైలాగ్ లు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. ఈ సినిమాలో డెబ్భై నుంచి ఎనభై వరకు పంచ్ లున్నాయని సునీల్ చెప్పాడు.