: ‘జక్కన్న’ ఆడియో రిలీజ్ ... మెగాస్టార్ చిరంజీవికి ఘనస్వాగతం
హైదరాబాద్ లోని శిల్పా కళావేదికలో ప్రారంభమైన ‘జక్కన్న’ ఆడియో రిలీజ్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి కొన్ని నిమిషాల క్రితం చేరుకున్నారు. ఈ సందర్భంగా సినిమా యూనిట్ ఆయనకు ఘన స్వాగతం పలికింది. విడుదలకు సిద్ధమవుతున్న హీరో సునీల్ తాజా చిత్రం ‘జక్కన్న’ను దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్ సరసన మన్నారా చోప్రా నటిస్తోంది. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు శంకర్, తదితరులు హాజరయ్యారు.