: అమెరికా రాయబారి రిచర్డ్ వర్మతో కేటీఆర్ భేటీ
అమెరికా రాయబారి రిచర్డ్ వర్మతో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఆయనకు వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాలోని పలు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయని, ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ లాంటి 14 ప్రాధాన్యత రంగాల్లో అమెరికాతో కలిసి పనిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సిలికాన్ వ్యాలీలో టి హబ్ ఔట్ పోస్ట్ ను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.