: టీడీపీ నేత‌ చింత‌మ‌నేని, వైసీపీ నేత శ్రీ‌ల‌క్ష్మి మ‌ధ్య తీవ్ర వాగ్వివాదం


తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శ్రీ‌ల‌క్ష్మి మ‌ధ్య ఈరోజు తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా చాటప‌ర్రులో ఆక్ర‌మ‌ణ‌లు కూల్చేందుకు అధికారులు ప్ర‌య‌త్నం చేశారు. దీనికి వ్యతిరేకంగా స్థానికులు అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్థానికులకు మద్దతుగా శ్రీ‌ల‌క్ష్మి అక్క‌డ‌కు చేరుకుంది. చింతమనేని ఆందోళ‌న‌కారుల‌కు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో శ్రీ‌ల‌క్ష్మి, చింత‌మ‌నేని మ‌ధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఒక‌రిపై ఒకరు విమ‌ర్శ‌లు గుప్పించుకున్నారు.

  • Loading...

More Telugu News