: పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో ఉత్తమ్‌కుమార్ చర్చ
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లోకి తమ నేతలు జంప్ అవుతోన్న అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి ఢిల్లీలో పార్టీ అధిష్ఠానంతో సమావేశమయ్యారు. పార్టీ ఫిరాయింపులపై ఉత్తమ్‌కుమార్ దిగ్విజయ్ సింగ్‌కు వివరించారు. ఆయనతో ఈ అంశంపై భేటీ అయిన అనంతరం ఫిరాయింపుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై న్యాయవాదులతో చర్చించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాల్సిందిగా ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్‌ను కాంగ్రెస్ నేతలు కోరినట్లు తెలుస్తోంది.