: హైదరాబాద్‌లో ప్లాస్టిక్ కవర్ల వాడకంపై ఆంక్షలు...జులై 31 నుంచి అమలు!
హైదరాబాద్‌లో రోజురోజుకీ పెరిగిపోతోన్న ప్లాస్టిక్ కవర్ల వాడకానికి అడ్డుకట్ట వేయడానికి అధికారులు చర్యలకు పూనుకున్నారు. ప్లాస్టిక్ నిషేధం అంశంపై జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రేటర్ పరిధిలో జులై 31 నుంచి ప్లాస్టిక్ కవర్ల వాడకంపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న కవర్లు వాడితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించిన షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. వ్యాపారుల లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు.