: వైఎస్సార్సీపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు: మంత్రి మాణిక్యాలరావు
సదావర్తి సత్రం భూముల అమ్మకంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, ఈ విషయమై వైఎస్సార్సీపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. సదావర్తి సత్రం భూముల అమ్మకాలకు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కృష్ణా పుష్కరాల ఏర్పాట్ల గురించి ఆయన ప్రస్తావించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి మాణిక్యాలరావు చెప్పారు.