: తూర్పు గోదావరి జిల్లాలో విషాదం.. రైలు కిందపడి ప్రేమికుల ఆత్మహత్య


తూర్పుగోదావరి జిల్లా తొండంగిలో విషాదం చోటుచేసుకుంది. అక్కడి సమీపంలోని రావికంపాడు వద్ద రైలు కిందపడి ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు విశాఖప‌ట్నంకి చెందిన‌ మ‌ణికంఠ‌, విజ‌య‌న‌గ‌రంకి చెందిన దివ్య‌గా పోలీసులు గుర్తించారు. వీరిరువురూ విశాఖ‌లోని అవంతి ఇంజ‌నీరింగ్ కాలేజీలో బీటెక్ చ‌దువుతున్నారు. కొద్ది కాలంగా ప్రేమించుకుంటోన్న వీరు ఈరోజు మ‌ధ్యాహ్నం రావికంపాడు వద్ద రైలు కిందపడి ఆత్మ‌హత్య చేసుకున్నారు. ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘ‌ట‌నపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News