: తెలంగాణ మిగులు రాష్ట్రం.. అయినా ఛార్జీలు పెంచేశారు: గాలి ముద్దు కృష్ణమ విసుర్లు
తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన జలవివాదంపై నిన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మంత్రులు దేవినేని ఉమా, హరీశ్ రావు భేటీ అయిన అంశంపై టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు స్పందించారు. కృష్ణానది జలాలపై మంత్రి హరీశ్‌రావు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. హరీశ్‌రావు ఈ అంశంపై వితండవాదం చేస్తున్నారని ఆయన విమర్శించారు. విభజన చట్టంలో తెలుగురాష్ట్రాల పెండింగ్ ప్రాజెక్టులపై పలు అంశాలు ఉన్నాయని, వాటిని అనుసరించే నడుచుకోవాలని ఆయన సూచించారు. కేసీఆర్ సర్కార్ విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు అమాంతం పెంచేసిందని, ఆదాయంలో మిగులు సాధిస్తున్నప్పటికీ ఛార్జీల భారం ప్రజలపై మోపడమేంటని ఆయన దుయ్యబట్టారు.