: ఎన్ని అడ్డంకులు సృష్టించినా మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టి తీరుతాం: హరీశ్‌ రావు


ప్ర‌భుత్వం చేప‌డుతోన్న‌ ప‌థ‌కాల‌పై ప్ర‌తిప‌క్షాలు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నాయని తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీ నేత‌ల్ని ఆలేరు, భువ‌న‌గిరి ప్రజ‌లు నిల‌దీయాలని ఆయ‌న వ్యాఖ్యానించారు. న‌ల్గొండ‌లోని ఆలేరు మార్కెట్ క‌మిటీ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హ‌రీశ్ రావు అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో మాట్లాడుతూ.. మ‌ల్ల‌న్న సాగ‌ర్‌పై ప్ర‌తిప‌క్షాలు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నాయని మండిప‌డ్డారు. తెలంగాణ ఏర్పాటుకు స‌హ‌క‌రించ‌ని నాయ‌కులు ఇప్పుడు అభివృద్ధికి కూడా స‌హ‌క‌రించ‌డం లేద‌ని హరీశ్ రావు ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌కు మల్లన్న సాగర్ వద్దనే హక్కు ఎక్కడిదని ఆయన దుయ్యబట్టారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూనిర్వాసితులకు చెల్లించిన నష్టపరిహారాన్ని గురించి ఆ పార్టీ నేతలు గుర్తు తెచ్చుకోవాలని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టి తీరుతామని అన్నారు.

  • Loading...

More Telugu News