: చెన్నై రైల్వేస్టేషన్ లో మహిళా టెక్కీ దారుణ హత్య


చెన్నైలోని ‘ఇన్ఫోసిస్’లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి స్వాతి(25)ని పట్టపగలే ఓ ఆగంతుకుడు హతమార్చాడు. ఈ రోజు ఉదయం ఆఫీసుకెళ్లేందుకని నుంగంబాకం రైల్వేస్టేషన్ లో రైలు కోసం ఎదురుచూస్తున్న స్వాతిని హఠాత్తుగా ఓ వ్యక్తి కత్తితో పొడిచి పారిపోయాడు. తోటి ప్రయాణికులు తేరుకుని చూసేలోపే ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్వాతి నగరంలోని చూలైమేడు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

  • Loading...

More Telugu News