: ఆలయంలో గాయపడ్డ సీబీఐ జేడీ


అక్రమార్కుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించే సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ నేడు స్వల్పంగా గాయపడ్డారు. జేడీ నేటి ఉదయం పశ్చిమగోదావరి జిల్లాలోని పలు దేవాలయాలను సందర్శించారు. భీమవరంలోని మావూళ్ళమ్మ దేవాలయంతో పాటు సోమేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి జేడీ కాలిని గట్టిగా తొక్కడంతో ఆయన గాయపడ్డారు. అనంతరం వైద్యులు చికిత్స చేసి కాలికి కట్టు కట్టారు.

  • Loading...

More Telugu News