: సోషల్ మీడియాలో ‘జగన్ గోల్ఫ్’ ఫొటోలు వైరల్


ఎప్పుడూ గంభీరంగా కనిపించే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గోల్ఫ్ ఆడారంటూ నిన్న సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఫొటోలు ఆ తర్వాత వైరల్ గా మారాయి. రాజకీయాల్లో నిత్యం బిజీగా కనిపించే జగన్... ప్రస్తుతం భార్యా బిడ్డలతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన కుటుంబం ఇంగ్లండ్ లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో నిన్న ఉన్నట్టుండి జగన్ గోల్ఫ్ ఆడుతున్న ఫొటోలు నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. విదేశీ పర్యటనలో ఉన్న జగన్ గోల్ఫ్ తో కాస్తంత సేద దీరారంటూ కొందరు ఆ ఫొటోలకు కామెంట్లు పెట్టగా, ఆ ఫొటోల్లో ఉన్నది జగనేనా? లేక ఎవరైనా ఫోటో షాప్ మాయాజాలంతో మార్ఫింగ్ చేశారా? అన్న అనుమానాలను కొందరు వ్యక్తం చేశారు. మామూలు ప్యాంట్, షర్ట్ లో కనిపించే జగన్... సదరు ఫొటోల్లో మాత్రం జీన్ ప్యాంట్, ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ తో కనిపిస్తున్నారు. ఫొటో చూసిన ఎవరైనా... అందులో కనిపిిస్తున్నది జగనేనని చెప్పేస్తున్నారు. అయితే ఈ ఫొటోలపై జరుగుతున్న చర్చకు సంబంధించి స్పందించేందుకు ఏ ఒక్క వైసీపీ నేత ముందుకు రాకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News