: ‘కుంగిన నేల’ వార్తలపై నారాయణ ఫైర్!... ఎక్కడ కుంగిందో చూపాలని జగన్ మీడియాకు సవాల్!


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో మూడు అడుగుల మేర నేల కుంగిందంటూ నిన్న వచ్చిన వార్తా కథనాలపై ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత నేరుగా వెలగపూడిలో కొనసాగుతున్న తాత్కాలిక సచివాలయ పనుల వద్దకు చేరుకున్న ఆయన మీడియా కథనాలపై విస్మయం వ్యక్తం చేశారు. 'ఎక్కడ కూలిందో చూపండి' అంటూ ఆయన అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులను నిలదీశారు. ప్రధానంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన మీడియా సంస్థలో ఈ వార్త ప్రధానంగా ప్రసారమైంది. దీనిని ప్రశ్నించిన ఆయన ‘‘24 గంటలూ సచివాలయంలోనే ఉంటా. నేల ఎక్కడ కుంగిందో వచ్చి చూపించండి’’ అంటూ సవాల్ విసిరారు. వైసీపీ చేస్తున్న అసత్య ఆరోపణలతో ప్రజల్లో ఆందోళన నెలకొందన్న నారాయణ ... ఈ తరహా చౌకబారు ప్రచారాన్ని మానుకోవాలని ఆయన వైసీపీకి హితవు పలికారు.

  • Loading...

More Telugu News