: ఇదీ నా గడ్డం కథ: దర్శకుడు రాఘవేంద్రరావు


ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు పేరు చెప్పగానే, ముందుగా మనకు గుర్తుకు వచ్చేది ఆయన గడ్డం. షూటింగులో ఎప్పుడు చూసినా ఆయన నిండు గడ్డంతోనే కనిపిస్తారు. ఈ గడ్డం విశేషం గురించి దర్శకేంద్రుడు తన ట్విట్టర్ ఖాతాలో తాజాగా వివరించారు. "జ్యోతి సినిమా అప్పట్నుంచి ప్రతి సినిమా మొదలు పెట్టినప్పుడు గడ్డం తీసేసి... ఆ సినిమా షూటింగ్ పూర్తయిన రోజునే మళ్లీ గడ్డం తీస్తాను. అదే సంప్రదాయాన్ని నమో వేంకటేశాయ సినిమాకి కూడా కొనసాగించాలనుకుంటున్నాను" అంటూ పోస్ట్ చేశారు. నాగార్జున, కీరవాణిలతో కలిసి రూపొందిస్తున్న తన నాలుగో భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’ అని, ఈ నెల 25న ముహూర్తం షాట్ తో ప్రారంభించబోతున్నామని ఆయన పేర్కొన్నారు. ‘ఈరోజు నేను, నాగార్జున కలిసి తిరుమలలో దర్శనం చేసుకుని తిరిగొచ్చాము’ అంటూ ఆ ట్వీట్ లో రాఘవేంద్రరావు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News