: తెలంగాణలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు.. వంద యూనిట్లలోపు వినియోగదారులకు మినహాయింపు
తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. ఈ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. సగటున 7.5 శాతం మేర విద్యుత్ ఛార్జీలను పెంచారు. అయితే, వంద యూనిట్లలోపు వినియోగదారులకు విద్యుత్ ఛార్జీల పెంపు నుంచి మినహాయింపు లభించింది. పెరిగిన విద్యుత్ ఛార్జీలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. డిస్కంలకు 2016-17 సంవత్సరానికి గాను రూ.4,554 కోట్ల రాయితీని ప్రభుత్వం ఇవ్వనుంది. ఛార్జీల పెంపు వల్ల విద్యుత్ సంస్థలకు రూ.1600 కోట్ల ఆదాయం లభిస్తుంది.